మూనీ, హేమలత ఊచకోత.. ముంబై ముందు గుజరాత్ భారీ టార్గెట్

by Harish |
మూనీ, హేమలత ఊచకోత.. ముంబై ముందు గుజరాత్ భారీ టార్గెట్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-2లో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ముందు గుజరాత్ జెయింట్స్ 191 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరగులు చేసింది. హేమలత(74), కెప్టెన్ బెత్ మూనీ(66) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. అయితే, మరో ఓపెనర్ లారా వోల్వార్డ్(13) నిరాశపర్చడంతో మొదట గుజరాత్‌కు శుభారంభం దక్కలేదు. 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో బెత్ మూనీ, హేమలత ఇన్నింగ్స్ నిర్మించారు. ముంబై బౌలర్లను ఊచకోస్తూ పరుగుల వరద పారించారు. దీంతో 10 ఓవర్లలో స్కోరు 100 దాటింది. ఈ క్రమంలోనే మూనీ 27 బంతుల్లో, హేమలత 28 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. అయితే, కాసేపటికే ఈ జోడీని సజన విడదీసింది. 14వ ఓవర్‌లో మూనీ బౌల్డ్ అవడంతో రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ముంబై బౌలర్లు పుంజుకోవడంతో గుజరాత్ తడబడింది. లిచ్‌ఫీల్డ్(3), గార్డ్‌నెర్(1) నిరాశపర్చగా.. హేమలత దూకుడుకు షబ్నిమ్ ఇస్మాయిల్ బ్రేక్ వేసింది. భారత ఫుల్మాలి(21 నాటౌట్) ఆఖర్లో విలువైన పరుగులు జోడించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 190/7 స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ 2 వికెట్లు తీయగా.. హేలీ మాత్యూస్, షబ్నిమ్ ఇస్మాయిల్, పూజ వస్త్రాకర్, సజన చెరో వికెట్ పడగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed