- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల నెరవేర్చుకున్న మహ్మద్ సిరాజ్.. ‘డ్రీమ్ కార్’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కొత్త ల్యాండ్ రోవర్ కారు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆదివారం సోషల్ మీడియా(ఇన్‌స్టాగ్రామ్) వేదికగా వెల్లడించారు. కారుతో తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేశారు. దీనికి ‘డ్రీమ్ కార్’ అనే క్యాప్షన్ రాసుకొచ్చారు. ‘నా ఫ్యామిలీ కోసం డ్రీమ్ కారు కొనుగోలు చేశాను. కలలకు లిమిట్ ఉండబోదు. హార్డ్ వర్క్ ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. దానికి ఇదే నిదర్శనం’ నెట్టింట్లో పేర్కొన్నారు. కాగా, రీసెంట్‌గా సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2024 టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. జట్టులో హైదరాబాద్‌కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా ఈ ట్రోఫీని గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు. దీంతో సిరాజ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇంటి స్థలం కేటాయించడంతో పాటు గ్రూపు-1 స్థాయి ఉద్యోగం కేటాయించారు.