MLC 2023: హాఫ్ సెంచరీతో చెలరేగిన క్లాసెన్‌..

by Vinod kumar |
MLC 2023: హాఫ్ సెంచరీతో చెలరేగిన క్లాసెన్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ తొలి ఎడిషన్‌లో సీటిల్‌ ఓర్కాస్‌ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. సీటిల్‌ ఓర్కాస్‌ జట్టు ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి.. లీగ్‌లో అజేయ జట్టుగా నిలిచింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సీటిల్‌ ఆర్కాస్‌ జట్టు.. శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌పై 35 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్కాస్‌ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టా​నికి 177 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (31 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో రఫ్ఫాడించగా.. హెట్‌మైర్‌ (36 నాటౌట్‌), నౌమన్‌ అన్వర్‌ (30), జయసూర్య (33) రాణించారు.

యునికార్న్స్‌ బౌలర్లలో ప్లంకెట్‌ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్‌ రౌఫ్‌, కోరె ఆండర్సన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యునికార్న్స్‌.. కెమరూన్‌ గ్యానన్‌ (4), ఆండ్రూ టై (2), ఇమాద్‌ వసీం (2), హర్మీత్‌ సింగ్‌ (1) చెలరేగడంతో 17.5 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. యునికార్న్స్‌ ఇన్నింగ్స్‌లో షాదాబ్‌ ఖాన్‌ (37) టాప్‌ స్కోరర్‌ కాగా.. మాథ్యూ వేడ్‌ (28), ఫిన్‌ అలెన్‌ (28), మార్కస్‌ స్టోయినిస్‌ (15), ఆరోన్‌ ఫించ్‌ (14), కోరె ఆండర్సన్‌ (12) రెండంకెల స్కోర్లు చేశారు.

Advertisement

Next Story

Most Viewed