- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అల్కరాజ్‌కు షాక్.. క్వార్టర్స్‌లో ఓటమి
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ దిశగా సాగిన వరల్డ్ నం.2 ఆటగాడు కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్) ప్రయాణం ముగిసింది. గురువారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అల్కరాజ్‌కు బల్గేరియా ప్లేయర్ గ్రిగోర్ డిమిత్రోవ్ షాకిచ్చాడు. అల్కరాజ్‌పై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన డిమిత్రోవ్ 6-2, 6-4 తేడాతో విజయం సాధించాడు. గంటా 32 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో అల్కరాజ్ వరుసగా రెండు సెట్లను కోల్పోయాడు. డిమిత్రోవ్ 4 సార్లు బ్రేక్ పాయింట్ సాధించగా.. అల్కరాజ్ ఒక్కసారి మాత్రమే బ్రేక్ పాయింట్ పొందాడు. మూడు డబుల్ ఫౌల్ట్స్, 8 అనవసర తప్పిదాలతో అల్కరాజ్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ నెలలో అల్కరాజ్ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story