మెస్సీ అరుదైన ఘనత.. కెరీర్ బెస్ట్ రికార్డు..

by Vinod kumar |
మెస్సీ అరుదైన ఘనత.. కెరీర్ బెస్ట్ రికార్డు..
X

దిశ, వెబ్‌డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ కప్ తర్వాత తొలిసారి అర్జెంటీనా తన హోమ్ కమింగ్ సెలబ్రెషన్స్‌లో భాగంగా పనామాతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ తన కెరీర్‌లో 800వ గోల్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 తేడాతో గెలిచింది. మెస్సీ అద్భుతమైన ఫ్రీ కిక్ గోల్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా మెస్సీ తన ఫుట్‌బాల్ కెరీర్‌లో 800వ గోల్‌ను సాధించాడు. అతడి కంటే ముందు పోర్చుగల్ స్టార్ రొనాల్డో 830 గోల్స్‌తో ఉన్నాడు. ప్రస్తుతం మెస్సీ కొట్టిన ఈ గోల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story