దేశానికి ఆడాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నా : తుషార్ దేశ్‌పాండే

by Harish |
దేశానికి ఆడాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నా : తుషార్ దేశ్‌పాండే
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ఐపీఎల్‌లో రాణించిన చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) యువ పేసర్ తుషార్ దేశ్‌పాండే టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో నాలుగో టీ20లో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. మరో పేసర్ అవేశ్ ఖాన్ స్థానంలో తుషార్‌కు తుది జట్టులో చోటు దక్కింది. అతనికి అసిస్టెంట్ కోచ్ బహుతలే టీమ్ ఇండియా క్యాప్ అందజేశాడు. అనంతరం తుషార్ దేశ్‌పాండే మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. దేశానికి ఆడాలన్న తన కల నెరవేరిందన్నాడు.

‘ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశానికి ఆడాలని చిన్నప్పటి నుంచి కలలుగన్న. నీలి రంగు ధరించినందుకు గర్వంగా ఉంది. ఐపీఎల్‌లో సీఎస్కేకు ఆడటం నాకు ఉపయోగపడింది. ఆ అనుభవం అంతర్జాతీయ క్రికెట్‌లో సహాయపడుతుందని అనుకుంటున్నా. మొదట నేను బ్యాటర్‌గా కెరీర్ మొదలుపెట్టాను. కాబట్టి, నేను సహజంగానే బ్యాటింగ్ చేయగలను. బ్యాటింగ్‌పై ఇంకా ఫోకస్ పెట్టి మెరుగుపర్చుకోవాలని చూస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, జింబాబ్వే పర్యటనలో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన ఐదో భారత ప్లేయర్ తుషార్. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, సాయి సుదర్శన్ ఇప్పటికే జట్టులో చోటు సంపాదించారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నయ్ తరపున తుషార్ సత్తాచాటాడు. 13 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి జట్టులో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.

Advertisement

Next Story

Most Viewed