Manu Bhaker : ఇండియాకి తిరిగి వచ్చిన మను భాకర్.. ఘన స్వాగతం పలికిన అభిమానులు

by Maddikunta Saikiran |
Manu Bhaker : ఇండియాకి తిరిగి వచ్చిన మను భాకర్.. ఘన స్వాగతం పలికిన అభిమానులు
X

దిశ, వెబ్‌డెస్క్ : పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారతదేశ డబుల్ కాంస్య పతక విజేత, స్టార్ పిస్టల్ షూటర్ మను భాకర్ ఈ రోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. భాకర్‌ పారిస్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం (AI 142) లో వచ్చారు.మార్నింగ్ 8.20కి రావాల్సిన ఈ విమానం గంట ఆలస్యంగా ఉదయం 9:20 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఆమెకు విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

కాగా.. పారిస్ గేమ్స్‌లో, భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో ఒక కాంస్యం ,సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లో మరో కాంస్యం సాధించింది. అయితే... ఆమె మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో తృటిలో పతకం కోల్పోయినప్పటికీ, నాల్గవ స్థానంలో నిలిచింది. దీంతో ఆమెపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లవెత్తుతున్నాయి. కాగా.. ఒకే ఒలింపిక్స్‌ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారతీయ అథ్లెట్ గా మను చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story