FIFA Club World Cup: ఒకే ఏడాది ఐదు టైటిళ్లతో రికార్డు.. మాంచెస్టర్ సిటీ మ‌రో టైటిల్

by Vinod kumar |
FIFA Club World Cup: ఒకే ఏడాది ఐదు టైటిళ్లతో రికార్డు.. మాంచెస్టర్ సిటీ మ‌రో టైటిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ జ‌ట్టు మాంచెస్టర్ సిటీ మ‌రో టైటిల్ కొల్లగొట్టింది. ప్రతిష్ఠాత్మక ఫిఫా క్లబ్ వ‌ర‌ల్డ్ క‌ప్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. శుక్రవారం జ‌రిగిన టైటిల్ పోరులో సంపూర్ణ ఆధిప‌త్యం చెలాయించిన మాంచెస్టర్ సిటీ 4-0తో ఫ్లుమినెన్స్‌ను చిత్తుగా ఓడించింది. మాంచెస్టర్ ఫార్వర్డ్ ప్లేయ‌ర్ జులియ‌న్ అల్వరెజ్ రెండు గోల్స్‌తో రాణించాడు. ఈ ఏడాది ఈ క్లబ్ రికార్డు స్థాయిలో ఐదో ట్రోఫీ అందుకోవ‌డం విశేషం. అవును.. ఈ ట్రోఫీ విజ‌యంతో ప్రీమియ‌ర్ లీగ్, ఎఫ్ఏ క‌ప్, యూఈఎఫ్ఏ చాంపియ‌న్స్ లీగ్, యూఈఎఫ్ఏ సూప‌ర్ క‌ప్ టైటిళ్లు గెలిచిన మొద‌టి ఇంగ్లీష్ జ‌ట్టుగా మాంచెస్టర్ సిటీ రికార్డు సృష్టించింది.

ఇరుజ‌ట్ల మ‌ధ్య హోరామోరీగా జ‌రుగుతుంద‌నుకున్న ఫైన‌ల్ కాస్త ఏక‌ప‌క్షంగా సాగింది. ఆట మొద‌లైన నిమిషంలోనే మాంచెస్టర్ సిటీ ఫార్డర్డ్ జులియ‌న్ అల్వరెజ్ గోల్ కొట్టాడు. దాంతో షాక్ తిన్న ప్లుమినెన్స్ ఆట‌గాళ్లు దూకుడుగా ఆడారు. కానీ నినో 27వ నిమిషంలో, ఫిల్ ఫొడెన్ 72వ నిమిషంలో గోల్ చేయ‌డంతో మాంచెస్టర్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక అల్వరెజ్ 88వ నిమిషంలో మ‌రోసారి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంప‌డంతో మాంచెస్టర్ సిటీ విజ‌యం ఖాయ‌మైపోయింది. మ‌రోవైపు ఫ్లుమినెన్స్ ఆట‌గాళ్లు ఎంత ప్రయ‌త్నించినా ఒక్క గోల్ కొట్టలేక‌పోయారు.

Advertisement

Next Story

Most Viewed