హెడ్ కోచ్‌గా గంభీర్.. సోషల్ మీడియాలో గౌతీ ఫస్ట్ రియాక్షన్ ఇదే

by Harish |
హెడ్ కోచ్‌గా గంభీర్.. సోషల్ మీడియాలో గౌతీ ఫస్ట్ రియాక్షన్ ఇదే
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ ముగిసింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ వారసుడిగా గంభీర్‌ను తదుపరి హెడ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రెటరీ జై షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

అనంతరం కొత్త రోల్ గురించి గంభీర్ ఎక్స్‌ వేదికగా స్పందించాడు. ప్రతి భారతీయుడిని గుర్వపడేలా చేస్తామని వ్యాఖ్యానించాడు. ‘భారతదేశం నా గుర్తింపు. నా దేశానికి సేవ చేయడం గొప్ప అదృష్టం. నేను తిరిగివచ్చినందుకు సంతోషంగా ఉంది. రోల్ మారినా నా గోల్ మాత్రం ఒక్కటే. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేయడమే. బ్లూ జెర్సీ ధరించిన ఆటగాళ్లు 1.4 బిలియన్ల భారతీయుల కలలు కంటారు. ఆ కలలను నిజం చేయడానికి ప్రయత్నిస్తా.’ అని రాసుకొచ్చాడు. కాగా, ఈ నెలలో శ్రీలంక పర్యటనతో గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed