సెమీస్‌లో సిక్కిరెడ్డి జోడీ ఓటమి

by Harish |
సెమీస్‌లో సిక్కిరెడ్డి జోడీ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్‌లో జరుగుతున్న స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ సిక్కిరెడ్డి-సుమిత్ రెడ్డి పోరాటం ముగిసింది. సెమీస్‌లో ఈ జంట టోర్నీ నుంచి నిష్ర్కమించింది. శనివారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో సిక్కిరెడ్డి-సుమిత్ జోడీ 17-21, 12-21 తేడాతో ఇండోనేషియాకు చెందిన రినోవ్ రివాల్డీ-మెంటారీ చేతిలో పరాజయం పాలైంది. టోర్నీలో వరుస విజయాలతో టైటిల్ ఆశలు రేపిన సిక్కి రెడ్డి జంట ఫైనల్‌కు అడుగుదూరంలో ఇంటిదారిపట్టింది. దీంతో ఈ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం కూడా ముగిసింది. సింగిల్స్‌లో ఇప్పటికే స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ నిష్ర్కమించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story