- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వార్టర్స్‌లో సింధు ఓటమి
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు టైటిల్ లేకుండానే మరో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. స్పెయిన్‌లో జరుగుతున్న స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె క్వార్టర్స్‌లో ఇంటిదారిపట్టింది. శుక్రవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు 26-24, 17-21, 20-22 తేడాతో థాయిలాండ్ షట్లర్ సుపానిడా కతేథాంగ్ చేతిలో పోరాడి ఓడింది. గంటా 17నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ నెగ్గి శుభారంభం చేసిన సింధు.. మిగతా రెండు గేమ్‌లను కోల్పోయింది. మరోవైపు, మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-సిక్కిరెడ్డి జోడీ సత్తాచాటింది. ఈ జోడీ సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో సక్కిరెడ్డి జోడీ 14-21, 21-11, 21-17 తేడాతో ఇండోనేషియాకు చెందిన కుషార్జాంటో-కుసుమావతిపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో అర్జున్-ధ్రువ్ కపిల, ఉమెన్స్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప జంటలకు నిరాశే ఎదురైంది. క్వార్టర్స్‌లో అర్జున్-ధ్రువ్ 19-21, 23-21, 17-21 తేడాతో జునైది ఆరిఫ్-రాయ్ కింగ్ యాప్(మలేషియా) జోడీ చేతిలో పోరాడి ఓడింది. అశ్విని-తనీషా జంటపై 13-21, 19-21 తేడాతో లీ చియా హ్సిన్-టెంగ్ చున్ హ్సున్(చైనీస్ తైపీ) జోడీ గెలుపొందింది.