మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ ఫైనల్‌లో భారత జోడీ..

by Vinod kumar |
మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ ఫైనల్‌లో భారత జోడీ..
X

దిశ, వెబ్‌డెస్క్: మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో భాగంగా భారత జోడి రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో బోపన్న జోడి 5–7, 7–6 (7/3), 10–4తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సాంటియాగో గొంజాలెజ్‌ (మెక్సికో)–రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జోడీని ఓడించింది. అయితే మాడ్రిడ్ మాస్టార్స్ టోర్నీలో బోపన్న ఫైనల్‌ చేరడం మూడోసారి. బోపన్న 2015లో టైటిల్ గెలవగా.. 2016లో రన్నరప్‌గా నిలిచాడు. దీంతో 7 ఏళ్ల తర్వాత మరోసారి ఈ టోర్నీలో ఫైనల్ పోరుకు అర్హత సాధించాడు.

Advertisement

Next Story

Most Viewed