టాస్ ఓడిపోవడం మాకు కలిసొచ్చింది: స్టీవ్ స్మిత్

by Shiva |
టాస్ ఓడిపోవడం మాకు కలిసొచ్చింది: స్టీవ్ స్మిత్
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియాను వారి స్వదేశంలోనే ఓడిస్తే ఆ మజానే వేరని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. విజయానంతరం మాట్లాడిన స్మిత్ సమష్టి కృషితోనే పటిష్ట భారత జట్టును ఓడించామని తెలిపాడు. మ్యాచ్‌ కు ముందు టాస్ ఓడిపోవడం, తొలి రోజు ఆసీస్ బౌలర్లు చెలరేగడం తమ విజయానికి కలిసొచ్చిందన్నాడు. ఇదే జోరును చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించి సిరీస్‌ను సమం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. తన సారథ్యంలో విజయం సాధించడం మరింత సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారవ్వడంపై కూడా స్మిత్ సంతోషం వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story