- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెంచరీతో ఐర్లాండ్‌ను ఆదుకున్న టక్కర్..
ఢాకా: ఏకైక టెస్టులో భారీ విజయంపై కన్నేసిన ఆతిథ్య బంగ్లాదేశ్‌కు ఐర్లాండ్ షాకిచ్చింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ టక్కర్(108) సెంచరీతో కదం తొక్కడంతో మూడో రోజు పర్యాటక జట్టు గొప్పగా పుంజుకుంది. 155 పరుగుల భారీ లోటుతో బుధవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ అదే రోజు 13 పరుగులకే టాప్-4 వికెట్లను కోల్పోయి ఇన్నింగ్స్ ఓటమి పొందేలా కనిపించింది. 27/4 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట కొనసాగించిన ఐర్లాండ్ త్వరగానే పీటర్ మూర్(16) వికెట్‌ను కోల్పోయింది. అయితే, మరో ఓవర్‌నైట్ బ్యాటర్ హ్యారీ టెక్టర్(56)తో కలిసి టక్కర్ ఆరో వికెట్‌కు 72 పరుగులు జోడించి ఆశలు రేపాడు. అనంతరం క్రీజులో పాతుకపోయిన టక్కర్‌కు ఆండీ మెక్‌బ్రైన్ తోడయ్యాడు.
బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ.. ఏడో వికెట్‌కు 111 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఐర్లాండ్ పోటీలోకి వచ్చింది. ఈ క్రమంలోనే టక్కర్ టెస్టుల్లో తొలి శతకం బాదేశాడు. టెస్టుల్లో ఐర్లాండ్ తరఫున సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా టక్కర్ నిలిచాడు. టక్కర్‌కు ముందు 2018లో కెవిన్ ఓబ్రెయిన్ మాత్రమే టెస్టు సెంచరీ చేశాడు. సెంచరీ చేసిన కాసేపటికే టక్కర్ అవుటవ్వగా.. మార్క్ అడైర్(13) కాసేపటికే వెనుదిరిగాడు. అనంతరం ఆండీ మెక్‌బ్రైన్(71 నాటౌట్), గ్రాహం హ్యూమ్(9 నాటౌట్) వికెట్ కాపాడుకుంటూ మూడో రోజు ఆటను ముగించారు. ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ 286/8 స్కోరు చేయగా.. 131 పరుగుల ఆధిక్యం సాధించింది.