Kadambari Jethwani:ముంబై నటి జెత్వానీ కేసులో కీలక అప్డేట్

by Jakkula Mamatha |
Kadambari Jethwani:ముంబై నటి జెత్వానీ కేసులో కీలక అప్డేట్
X

దిశ,వెబ్‌డెస్క్: ముంబయి నటి కాదంబరి జెత్వానీ(Kadambari Jethwani) కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌(Vidyasagar)ను కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విచారణను న్యాయస్థానం ఈ నెల(నవంబర్) 7కి వాయిదా వేసింది. ఈ క్రమంలో విద్యాసాగర్‌ను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మూడో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు(Court of Chief Judicial Magistrate) విద్యాసాగర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. విద్యాసాగర్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. ట్రయల్‌ కోర్టులో ఇప్పటికే బెయిల్‌ అప్లికేషన్‌ దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టుకు విద్యాసాగర్‌ తరపు న్యాయవాదులు తెలిపారు. బెయిల్‌ అప్లికేషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని విద్యాసాగర్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. మూడు వారాల్లో బెయిల్‌ అప్లికేషన్‌పై నిర్ణయం తీసుకోవాలని లోయర్‌ కోర్టుకు ధర్మాసనం మార్గదర్శకాలు ఇచ్చింది.

Advertisement

Next Story