- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు బయటపెట్టిన చేతన్ శర్మ ఎవరు..?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే పేరు. స్టింగ్ ఆపరేషన్‌తో ఒక్కసారిగా తన పేరు హైలైట్ అయింది. ఈ ఆపరేషన్‌లో ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్స్, ప్లేయర్ ఎంపిక పలు విషయాల గురించి సంచలన విషయాలు బయట పెట్టాడు.. ఆయన చేతన్ శర్మ. చేతన్ శర్మ గురించి మీకు తెలియన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. 1966, జనవరి 3న చేతన్ జన్మించిన చేతన్ శర్మ పంజాబ్ తరఫున 17 ఏళ్లకే రంజీ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాదే భారత్‌కు వన్డేల్లో ఎంపికయ్యారు.
టెస్టుల్లో 1984లో అరంగేట్రం చేశారు. పాక్ బ్యాటర్ మొహిసిన్ ఖాన్‌ను ఐదో బంతికే ఔట్ చేసి.. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన మూడో భారతీయుడిగా రికార్డు సృష్టించారు. 1985లో శ్రీలంక జట్టుతో జరిగిన మూడు టెస్టుల్లో 14 వికెట్స్ తీసి సంచలనం సృష్టించారు. ఇంగ్లాండ్‌ను 2-0తో ఓడించిన ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో 16 వికెట్లు తీశాడు. బర్మింగ్‌హామ్‌లో 6/58 సహా 10 వికెట్లు పడగొట్టారు. ఇదే అతనికి కెరీర్ బెస్ట్‌గా నిలిచింది. ఇంగ్లాండ్‌లో పది వికెట్ల ఘనత ఇప్పటికీ ఆయనదే.
చేతన్ శర్మ 1987 రిలయన్స్ వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్ అందుకున్నారు. కెన్ రూథర్‌ఫర్డ్, ఇయాన్ స్మిత్, ఎవిన్ ఛాట్‌ఫీల్డ్‌ను వరుస బంతుల్లో పెవిలియన్ పంపించారు. వన్డే వరల్డ్ కప్‌లో తొలి హాట్రిక్ సాధించిన ఘనత ఆయనదే. కపిల్ దేవ్ తర్వాత మంచి ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించాడు. 1989 నెహ్రూకప్‌లో ఇంగ్లాండ్‌పై మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి.. 256 లక్ష్యాన్ని ఛేదించారు. కేవలం 96 బంతుల్లో 101 నాటౌట్‌గా నిలిచారు. చేతన్ శర్మ 23 టెస్టుల్లో 396 రన్స్, 61 వికెట్లు పడగొట్టారు. 65 వన్డేల్లో 456 రన్స్, 67 వికెట్లు తీశాడు.
1996 లో చేతన్ శర్మ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాకా.. చేతన్ శర్మ కామెంటరీ, పొలిటీషియన్‌గా చేశారు. రాజకీయల్లో 2009లో బీఎస్పీ తరఫున ఫరీదాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోగా.. తర్వాత బీజేపీలో చేరారు. 2020లో చేతన్ టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవికి ఎంపికయ్యారు. అయితే చేతన్ శర్మ.. సంజూ శాంసన్, యువ క్రికెటర్ల ఎంపికల్లో విమర్శలు ఎదుర్కొన్నారు. రెండు టీ20 ప్రపంచకప్‌లు ఓడిపోవడంతో 2022లో చేతన్ శర్మపై బీసీసీఐ వేటు వేసింది. మళ్లీ నోటిఫికేషన్ వేయగా.. ఇంటర్వ్యూ చేసి చేతన్ శర్మను చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుత స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో ఆయన కెరీర్ సందిగ్ధంగా మారింది.
Also Read...
మహ్మద్ షమీ రిటైర్‌మెంట్‌పై టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ ఆసక్తికర కామెంట్స్