- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ ప్రైజ్‌మనీ.. నీ జీతం కంటే తక్కువేగా : రఘువంశీ మాటలను గుర్తు చేసుకున్న స్టార్క్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 చాంపియన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచిన విషయం తెలిసిందే. టైటిల్ గెలిచిన కేకేఆర్‌కు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. ఈ సీజన్ కంటే ముందు జరిగిన వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ బౌలర్ మిచెల్ స్టార్క్ కోసం రూ. 24.75 కోట్లు కుమ్మరించింది. టోర్నీ ప్రైజ్‌మనీ కంటే స్టార్క్ జీతమే ఎక్కువ కావడం గమనార్హం. అయితే, టోర్నీ గ్రూపు దశలో అంచనాలను అందుకోకపోవడంతో వేతనం విషయంలో స్టార్క్ విమర్శలు ఎదుర్కొన్నాడు.
తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న స్టార్క్.. ఐపీఎల్ ప్రైజ్‌మనీ, తన వేతనం విషయంలో కేకేఆర్ యువ బ్యాటర్ రఘువంశీతో జరిగిన సరదా సంభాషణను గుర్తు చేసుకున్నాడు. ‘ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత ప్రజెంటేషన్ కార్యక్రమం అర్ధరాత్రి వరకు ప్రారంభంకాలేదు. విజేతగా నిలిచిన మాకు చెక్ అందజేశారు. ప్రైజ్‌మనీ రూ.20 కోట్లు. మేమంతా ఒక దగ్గర కూర్చుని ఉన్నాం. రఘువంశీ చెక్‌ను చూసి.. ‘ఉప్.. నీకు ఇచ్చిన జీతం కన్నా తక్కువేగా’అని అన్నాడు.’ అని స్టార్ చెప్పుకొచ్చాడు.
కాగా, 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఆడిన అతను గ్రూపు దశలో అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో అతని వేతనంపై విమర్శలు వచ్చాయి. అయితే, సెమీస్, ఫైనల్‌లో చెలరేగి తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. మొత్తం 13 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు.