- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూఏఈ హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ ఓపెనర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ యూఏఈ పురుషుల జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు. ఈ విషయాన్ని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు జనరల్ సెక్రెటరీ ముబాష్షిర్ ఉస్మానీ ధ్రువీకరించారు. పాకిస్తాన్‌కు చెందిన ముదస్సార్ నాజర్ నుంచి అతను బాధ్యతలు అందుకోనున్నాడు. మూడేళ్లపాటు లాల్‌చంద్ రాజ్‌పుత్ యూఏఈ జట్టుకు సేవలందించనున్నాడు. ఈ వారంలో అతను హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. కోచ్‌గా లాల్‌చంద్ రాజ్‌పుత్ మంచి అనుభవం ఉంది. 1985-87లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను రెండు టెస్టులు, 4 వన్డేలు మాత్రమే ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత కోచింగ్‌పై ఫోకస్ పెట్టాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు అతను కోచ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కోచ్‌గా, 2018-22 వరకు జింబాబ్వేకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు.
Advertisement
Next Story