Olympics: నోటికాడి ముద్ద నేలపాలు అంటే ఇదే!.. ఒలంపిక్స్‌లో లక్ష్యసేన్‌కు వింత అనుభవం

by Ramesh Goud |
Olympics: నోటికాడి ముద్ద నేలపాలు అంటే ఇదే!.. ఒలంపిక్స్‌లో లక్ష్యసేన్‌కు వింత అనుభవం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నోటిదాక వచ్చిన కూడు నేలపాలు కావడం అనే తెలుగు సామెతను తరుచూ వాడుతుంటాము. పారిస్ ఒలంపిక్స్ లో ఓ భారత క్రీడాకారుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. భారత్ కు చెందిన స్టార్ షెట్లర్ లక్ష్యసేన్ పారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ లో పాల్గొని మొదటి మెన్స్ సింగిల్ మ్యాచ్ లో ఘన విజయం సాధించాడు. కానీ ఆ విజయం లెక్కలోకి రాకుండా పోయింది. లక్ష్యసేన్ గెలిచిన మ్యాచ్ ను ఒలంపిక్స్ నిర్వహకులు రద్దు చేశారు. లక్ష్యసేన్ తో ఆడిన మ్యాచ్ లో ఓడిన గ్వాటెమాలన్ ప్లేయర్ కెవిన్ కార్డన్ కు ఆట అనంతరం ఎడమ చేతికి గాయమైంది. దీంతో అతడు ఒలంపిక్స్ నుంచి వైదొలిగాడు. రూల్స్ ప్రకారం ఒలంపిక్స్ నుంచి వైదొలిగిన ఆటగాడి మ్యాచ్ లు నిర్వాహాకులు రద్దు చేస్తారు. అలాగే కెవిన్ కార్డన్ మ్యాచ్ కూడా రద్దు చేశారు. అంతేగాక కెవిన్ అసలు ఒలంపిక్స్ ఆడనట్లు ప్రకటించారు. దీంతో లక్ష్యసేన్ కష్టపడి గెలిచిన మ్యాచ్ కు విలువ లేకుండా పోయింది. దీనిపై లక్ష్యసేన్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ఒలంపిక్స్ రూల్స్ పై మండిపడుతున్నారు. ఈ రూల్ అన్యాయంగా ఉందని, వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా పారిస్ ఒలంపిక్స్ లో లక్ష్యసేన్, కెవిన్ కార్డన్ తో ఆడిన మ్యాచ్ లో 21-8, 22-20 తేడాతో గెలుపొందాడు.

Advertisement

Next Story

Most Viewed