మరో అరుదైన రికార్డు చేరువలో కింగ్ కోహ్లి

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-07 03:00:57.0  )
మరో అరుదైన రికార్డు చేరువలో కింగ్ కోహ్లి
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఈనెల 9 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌లో ఓ అరుదైన ఘనత సాధించేందుకు కోహ్లి చేరువలో ఉన్నాడు. కింగ్ కోహ్లి మరో 64 పరుగులు సాధిస్తే అత్యంత వేగంగా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో 25వేల పరుగులు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటిదాకా 546 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి 24936 పరుగులు సాధించాడు. కాగా సచిన్ టెండూల్కర్‌కు 24000 పరుగులు పూర్తి చేసేందుకు 543 ఇన్నింగ్స్ అవసరం కాగా, రికీ పాంటింగ్ 565, జాక్ కలిస్‌కు 573, సంగక్కరకు 591 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ మార్క్ చేరుకున్నారు.

టీంఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్ పూర్ వేదికగా తొలి టెస్ట్ ఆడనుంది. భారత్ - ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 102 టెస్ట్ ల్లో తలపడగా 30 మ్యాచ్ ల్లో టీమిండియా, 43 మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలుపొందాయి. 29 మ్యాచ్ ల్లో 28 డ్రా కాగా ఒక మ్యాచ్ టైగా ముగిసింది. సిరీస్ ల విషయానికొస్తే 27 సిరీస్‌లలో భారత్ 10, ఆసీస్ 12 గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.

Also Read...

టెస్టు క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ తమ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామం

Advertisement

Next Story