తప్పిపోయిన స్టార్ క్రికెటర్ తండ్రి.. కొద్ది గంటలకే..

by Mahesh |
తప్పిపోయిన స్టార్ క్రికెటర్ తండ్రి.. కొద్ది గంటలకే..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ క్రికెటర్ కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ సోమవారం పూణెలో తప్పిపోయిన సంగతి తెలిసిందే. దీంతో జాదవ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయన అదృశ్యమైన కొన్ని గంటల వ్యవధిలో ఆచూకీ కనుకున్నారు. తప్పిపోయిన మహదేవ్ ముంద్వా ప్రాంతంలో దొరికినట్లు పోలీసు అధికారి తెలిపారు. కాగా కేదార్ జాదవ్ తండ్రి గత కొంత కాలంగా బుద్దిమాంద్యం తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన తప్పిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే కేదార్ తన తండ్రి పోలీస్ స్టేషన్ లో ఉన్న చిత్రాన్ని షేర్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశాడు.. "ప్రార్థనలకు అందరికీ ధన్యవాదాలు... ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారు."

Advertisement

Next Story