FIH Junior Women's World Cup 2023: కెనడాతో భారత్ తొలి పోరు..

by Vinod kumar |
FIH Junior Womens World Cup 2023: కెనడాతో భారత్ తొలి పోరు..
X

న్యూఢిల్లీ : ఎఫ్‌ఐహెచ్ జూనియర్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్‌ టోర్నీలో భారత్ తొలి పోరులో కెనడాతో తలపడనుంది. వరల్డ్ కప్ పూల్స్, షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) గురువారం రాత్రి ప్రకటించింది. ఈ టోర్నీకి చిలీ ఆతిథ్యమివ్వనుండగా.. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 10 మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా ఆరు గ్రూపలుగా విభజించారు. టోర్నీలో భారత జట్టును పూల్-సిలో చేర్చగా.. వరల్డ్ నం.3 జర్మనీతోపాటు వరల్డ్ నం.11 బెల్జియం, వరల్డ్ నం.18 కెనడా జట్టూ ఉన్నాయి.

ప్రస్తుతం భారత్ ర్యాంక్ ఆరు. నవంబర్ 29న కెనడాతో జరిగే తొలి గ్రూపు మ్యాచ్‌తో భారత్ టోర్నీని ఆరంభించనుండగా.. డిసెంబర్ 1న జర్మనీతో, 2వ తేదీన బెల్జియంతో మ్యాచ్‌లు ఆడనుంది. పూల్-ఏలో నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, చిలీ జట్లు.. పూల్-బిలో అర్జెంటీనా, కొరియా, స్పెయిన్, జింబాబ్వే.. పూల్-డిలో ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్, జపాన్ జట్లను చేర్చారు. కాగా, ఇటీవల ఉమెన్స్ జూనియర్ ఆసియా కప్ నెగ్గి ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత అమ్మాయిలు మెగా టోర్నీలోనూ సత్తాచాటాలని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed