Joe Root : ద్రవిడ్ రికార్డు సమం చేసిన జో రూట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-08 07:13:56.0  )
Joe Root : ద్రవిడ్ రికార్డు సమం చేసిన జో రూట్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ భారత బ్యాటింగ్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ రూట్ ఈ ఫీట్ సాధించాడు. 130 బంతుల్లో 11 ఫోర్లు బాది రూట్ 106 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్(51), జాక్వెస్ కలిస్(45), రికీ పాంటింగ్(41), కుమార సంగక్కర(38) సెంచరీలు చేయగా ద్రవిడ్(36) సెంచరీల రికార్డును రూట్ సమం చేశాడు.

రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం

ఇక న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌ను 427/6 వద్ద ఇంగ్లాండ్ డిక్లేర్ చేసింది. దీంతో 583 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ 323 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టులో టామ్ బ్లండెల్ (115) ఒక్కడే సెంచరీ చేసి రాణించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలో ఉంది. డిసెంబర్ 14నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.

Next Story

Most Viewed