- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుమ్రాకు కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి.. కానీ : దినేశ్ కార్తీక్
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఇటీవల కెప్టెన్సీపై ఆసక్తి తెలియజేసేలా వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీ20 కెప్టెన్ రేసులో బుమ్రా కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, బీసీసీఐ సూర్యకుమార్‌కు పగ్గాలు అప్పగించింది. తాజాగా భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ టీమిండియాకు బుమ్రా కెప్టెన్ అయ్యే అవకాశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. బుమ్రాకు కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని, కానీ, ఫాస్ట్ బౌలర్ కావడం వల్ల కెప్టెన్సీ అతనిపై అదనపు భారం అవుతుందని అభిప్రాయపడ్డాడు. బుమ్రా ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను, కెప్టెన్సీ అదనపు భారం ఎలా అవుతుందనేది వివరించాడు.
‘ప్రశాంతత, ముఖ్యంగా మంచి పరిణితి చెందిన క్రికెటర్ బుమ్రా. కానీ, అతనో ఫాస్ట్ బౌలర్ అని మర్చిపోవద్దు. నిలకడగా మూడు ఫార్మాట్లు ఎలా ఆడగలడు?. సెలెక్టర్ల ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న అదే. బుమ్రాలాంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌ను కాపాడుకోవడం, ముఖ్యమైన మ్యాచ్‌ల్లో ఆడించడం చాలా ముఖ్యం.’ అని చెప్పాడు. బుమ్రా కోహినూరు వజ్రం లాంటి వాడని, అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చాలా కాలం పాటు ఆడేలా చూడాలన్నాడు. ‘బుమ్రా ఏ ఫార్మాట్‌లోనైనా ప్రభావం చూపగలడు. అదే జట్టుకు కావాలి. కెప్టెన్సీ అతనికి అదనపు భారం అవుతుంది. చాలా సిరీస్‌లు ఆడటం ద్వారా గాయపడితే జట్టుకు సమస్య.’ అని కార్తీక్ చెప్పుకొచ్చాడు.
కాగా, బుమ్రా గతంలో రెండు సందర్భాల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2022లో ఇంగ్లాండ్‌తో టెస్టులో జట్టును నడపించాడు. అలాగే, గతేడాది ఐర్లాండ్‌పై 2-0 సిరీస్ విజయం సాధించిన భారత జట్టుకు బుమ్రానే సారథి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ప్రస్తుతం దులీప్ ట్రోఫీకి బుమ్రాకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా అతనికి రెస్ట్ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
- Tags
- Jasprit Bumrah