WTC వేళ రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్ అండర్సన్

by GSrikanth |
WTC వేళ రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్ అండర్సన్
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ వేళ ఇంగ్లాండ్ జట్టుకు అనూహ్య షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. తన 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. కాగా, టెస్ట్ కెరియర్‌ విషయానికొస్తే.. ఇప్పటి వరకు 187 టెస్టుల్లో 700 వికెట్లను పడగొట్టాడు. టెస్టు క్రికెట్‍లో అత్యధిక వికెట్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) తర్వాత ఆండర్సనే ఉన్నాడు. అలాగే, 700 టెస్టు వికెట్లు దక్కించుకున్న తొలి పేసర్‌గానూ చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఈ ఏడాది జూలై 10వ తేదీ నుంచి వెస్టిండీస్‍తో ఇంగ్లండ్ ఆడే టెస్టు మ్యాచ్‍ జేమ్స్ ఆండర్సన్‍కు చివరిది కానుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఈ టెస్టు జరగనుంది. 2003 మే 22వ తేదీన లార్డ్స్ స్టేడియంలో జింబాబ్వేతో మ్యాచ్‍తోనే ఆండర్సన్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పుడు 2024 జూలైలో తన ఆఖరి 188వ టెస్టును అదే గ్రౌండ్‍లో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‍కు గుడ్‍బై చెప్పనున్నాడు.

Advertisement

Next Story