- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టు క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. ఎవరికీ అందనంత ఎత్తులో అండర్సన్
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా టీమిండియాపై అనేక రికార్డులు తిరగరాసిన ఆయనకు ఇక్కడ కూడా అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానంలో ఇండియా vs ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌తో జేమ్స్ అండర్సన్ రికార్డు సృష్టించాడు.
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అండర్సన్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. నాలుగొందలు కాదు.. ఐదొందలు కాదు.. ఏకంగా 700 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్‌గా నిలిచారు. మొత్తం 187 టెస్టులు ఆడిన అండర్సన్ ఈ ఫీట్ సాధించారు. ధర్మశాల వేదికగా జరిగిన ఇవాళ్టి టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడంతో ఈ రికార్డు నమోదైంది. కాగా, శ్రీలంక ప్లేయర్ మురళీధరన్(800), ఆస్ట్రేలియా ప్లేయర్ షేన్ వార్న్(708) వికెట్లు తీసి మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. అండర్సన్ మూడో స్థానానికి చేరాడు. పేసర్లలో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అండర్సన్ రికార్డుల్లోకి ఎక్కాడు.