ICC ODI World Cup 2023: ఈసారి అతడే టాప్‌ స్కోరర్‌.. సౌతాఫ్రికా లెజెండ్‌

by Vinod kumar |   ( Updated:2023-08-25 15:22:20.0  )
ICC ODI World Cup 2023: ఈసారి అతడే టాప్‌ స్కోరర్‌.. సౌతాఫ్రికా లెజెండ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్​ గురించి సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వన్డే ప్రపంచకప్‌లో ఏ బ్యాటర్​ ఎక్కువ పరుగులు చేస్తాడో జోస్యం చెప్పాడు. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ ​జోస్​ బట్లర్ టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. భారత పిచ్‌లపై అతడు ఈసారి మెరుగ్గా రాణిస్తాడని భావిస్తున్నా. ఇంగ్లండ్‌ ఈ వరల్డ్‌కప్‌లో కూడా మంచి ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉందని కలిస్ అభిప్రాయపడ్డాడు. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్‌ వేదికగా వరల్డ్‌కప్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

ఇప్పటివరకు బట్లర్ 165 వన్డేల్లో 41.49 సగటుతో 4,647 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే.. భారత్‌లో మాత్రం బట్లర్ ​వన్డే రికార్డు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు భారత గడ్డపై 8 వన్డే మ్యాచ్‌లు ఆడిన​ బట్లర్‌.. కేవలం 83 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 31 మాత్రమే. ఈ నేపథ్యంలో భారత్‌ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో జోస్‌ బట్లర్‌ టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడని జాక్వెస్‌ కలిస్‌ అంచనా వేయడం గమనార్హం.

Advertisement

Next Story