- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గిల్ నిర్ణయంపై తండ్రి అసంతృప్తి
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ ప్రదర్శనపై అతని తండ్రి లఖ్వీందర్ సంతోషం వ్యక్తం చేశాడు. దూకుడు ఆట తీరు పట్ల ఆనందించిన ఆయన.. గిల్ స్క్వేర్ కట్, కవర్ డ్రైవ్ షాట్‌లు బాగా ఆడాడని ప్రశంసించాడు. అదే సమయంలో గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అతను ఓపెనర్‌గానే రావాలని సూచించాడు. ‘మూడో స్థానంలో బ్యాటింగ్ ప్రతిసారి సరైంది కాదు. డ్రెస్సింగ్ రూంలో ఎక్కువ సేపు కూర్చోవడం ద్వారా ఒత్తిడి పెరుగుతుంది. నం.3 అనేది ఓపెనింగ్ చేసినట్టు కాదు. మిడిలార్డర్ బెర్త్ కూడా కాదు. గిల్ నిర్ణయాల్లో నేను జోక్యం చేసుకోను. సొంత నిర్ణయాలు తీసుకునే వయసు అతనికి వచ్చింది.’ అని లఖ్వీందర్ వ్యాఖ్యానించాడు. సహజ ఆట ఆడకపోవడంతో ఇబ్బందుల్లో పడతారని చెప్పుకొచ్చాడు.
Advertisement
- Tags
- #Shubman Gill
Next Story