- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్సీబీలోకి పంత్.. కోహ్లీ అడ్డు చెప్పాడా?.. పంత్ ట్వీట్
దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో తాను సంప్రదింపులు జరిపినట్టు వస్తున్న వార్తలను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొట్టిపారేశాడు. అలాంటి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ఆర్సీబీని పంత్ సంప్రదించాడని, కానీ, కోహ్లీ అనుకూలంగా లేకపోవడంతో పంత్ ప్రతిపాదనను ఆర్సీబీ తిరస్కరించిందని ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దీనికి పంత్ వెంటనే బదులిస్తూ.. అవన్నీ ఫేక్ వార్తలని, నిజాలు తెలియకుండా ఇలాంటివి సృష్టించొద్దని ఆ నెటిజన్‌గా గట్టిగా చెప్పాడు. ‘‘సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను ఎందుకు ప్రచారం చేస్తున్నారు?. తెలివిగా ఉండండి. ఇది మంచిది కాదు. కారణం లేకుండా ఇలాంటివి సృష్టించొద్దు. ఇది మొదటిసారి. చివరి సారి కూడా కాదనుకుంటున్నా. అందుకే, స్పందించాల్సి వచ్చింది. నిజాలను తెలుసుకోండి. ఇది మీకోసం మాత్రమే కాదు. తప్పుడు వార్తలను ప్రచారం చేసే వ్యక్తుల కోసం.’ అని రాసుకొచ్చాడు. కాగా, కారు ప్రమాదం తర్వాత పంత్ ఐపీఎల్‌తోనే మైదానంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పునరాగమనంలో అదరగొట్టిన అతను 13 మ్యాచ్‌ల్లో 446 పరుగులు చేశాడు.