- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ వేళానికి వేళాయే.. జాక్‌పాట్ కొట్టేదెవరో?
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలానికి వేళైంది. రెండు రోజులపాటు జరిగే వేలం ఆదివారం మొదలుకానుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నేడు, రేపు వేలం జరగనుంది. స్టార్ ఆటగాళ్లు వేలంలోకి రావడంతో వారి కోసం ఫ్రాంచైజీలు పోటీపడటం ఖాయం. మరి, ఈ మెగా వేలంలో ఎవరికి జాక్‌పాట్ దక్కుతుందో చూడాలి. వేలంలో 204 బెర్త్‌లను భర్తీ చేయనున్నారు. వాటి కోసం 577 మంది ప్లేయర్లు బరిలో నిలిచారు. అందులో 366 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఓవర్సీస్ ఆటగాళ్ల కోసం 70 స్లాట్స్ కేటాయించారు. నేడు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభంకానుంది.
రూ. 2 కోట్ల కనీస ధరతో 81 మంది
577 మంది ఆటగాళ్లు 8 బేస్ ప్రైజ్ కేటగిరీల్లో పాల్గొంటారు. అత్యధిక కనీస ధర రూ. 2 కోట్ల కేటగిరీలో 81 మది ప్లేయర్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆ జాబితాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, షమీ, సిరాజ్ సహా స్టార్ ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు, రూ.1.5 కోట్ల కేటగిరీలో 27 మంది, రూ.1.25 కోట్ల కేటగిరీలో 18 మంది, రూ. కోటీ కనీస ధర కేటగిరీలో 23 మంది, రూ. 75 లక్షల కేటగిరీలో 92 మంది, రూ. 50 లక్షల కేటగిరీలో 8 మంది, రూ. 40 లక్షల కేటగిరీలో 5 మంది నమోదు చేసుకున్నారు. అత్యధికంగా 320 మంది ప్లేయర్లు రూ. 30 లక్షల బేస్ ప్రైజ్ కేటగిరీలో వేలంలో పాల్గొననున్నారు.
ఏ జట్టు దగ్గర ఎంత డబ్బు ఉందంటే?
పంజాబ్ కింగ్స్ అత్యధిక పర్సు వాల్యూతో వేలంలోకి రానుంది. ఆ జట్టు వద్ద రూ. 110.5 కోట్లు ఉన్నాయి. కాబట్టి, వేలంలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ల కోసం భారీ ధర బిడ్ వేయొచ్చు. ఆ తర్వాత బెంగళూరు వద్ద రూ.83 కోట్లు, ఢిల్లీ వద్ద రూ.73 కోట్లు ఉండగా.. గుజాత్, లక్నో చెరో రూ. 69 కోట్లతో వేలంలోకి వస్తున్నాయి. చెన్నయ్ వద్ద రూ. 55 కోట్లు, కోల్‌కతా వద్ద రూ. 51 కోట్లు ఉండగా.. హైదరాబాద్, ముంబై చెరో రూ.45 కోట్లతో వేలానికి సిద్ధమయ్యాయి. ఇక రాజస్థాన్ అతి తక్కువ పర్సు వాల్యూ రూ. 41 కోట్లతో ఆక్షన్‌లోకి రానుంది.
వారిపైనే ఫోకస్
ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. ఈ ఆసిస్ పేసర్‌ను కోల్‌కతా గత వేలంలో రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో స్టార్క్ రికార్డును ఎవరు బద్దలు కొడతారో చూడాలి. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్,కేఎల్ రాహుల్, మహ్మద్ షమీలపై భారీ అంచనాలు ఉన్నాయి. వీరి కోసం ఫ్రాంచైజీలు ఎగబడతాయనడంలో సందేహం అక్కర్లేదు. కోల్‌కతా వదిలివేయడంతో స్టార్క్ కూడా వేలంలో పాల్గొంటున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ బట్లర్ కూడా భారీ ధర పలకొచ్చు. అలాగే, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, సిరాజ్, హర్షల్ పటేల్‌లపై కూడా ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి.