IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ కోచ్..

by Vinod kumar |
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ కోచ్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2024 సీజన్ ఆరంభానికి ముందు హెడ్ కోచ్‌ని మారుస్తూ.. నిర్ణయం తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్. గత రెండు సీజన్లలో ఎల్‌ఎస్‌జీకి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ఆండీ ప్లవర్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ని హెడ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరించిన జస్టిన్ లాంగర్, ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

‘ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి హెడ్ కోచ్‌గా రాబోతుండడం ఆనందంగా ఉంది. ఈ జర్నీలో ఓ గొప్ప టీమ్‌ని నిర్మించడంలో నా వంతు పాత్ర పోషిస్తాను. టీమ్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా..’ అంటూ కామెంట్ చేశాడు జస్టిన్ లాంగర్. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆరంగ్రేటం చేసిన లక్నో సూపర్ జెయింట్స్, రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగలిగింది. అయితే రెండు సీజన్లలోనూ ఎలిమినేటర్ మ్యాచుల్లో ఓడి నాలుగో స్థానానికే పరిమితమైంది.

Advertisement

Next Story

Most Viewed