IPL 2023: నేటితో ఐపీఎల్ షురూ.. ఫస్ట్ మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడనున్న చెన్నై

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-02 08:50:36.0  )
IPL 2023: నేటితో ఐపీఎల్ షురూ.. ఫస్ట్ మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడనున్న చెన్నై
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ ఈ రోజు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ తో చెన్నై తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ప్రపంచంలో పెద్దదైన అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం వేదిక కానుంది. అయితే గతేడాది అడుగుపెట్టి సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నైతో ఈ రోజు 7.30 గంటల నుంచి తలపడనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో లైవ్ రానుంది. మే 28 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. తొలిరోజు ప్రారంభ వేడుకల సందర్భంగా ప్రముఖ గాయకుడు అర్జీత్ సింగ్ లైవ్ పర్ఫెమెన్స్ ఇవ్వనున్నారు. దీంతో పాటు కత్రినా కైఫ్, టైగర్ ష్రాఫ్, రష్మిక మందాన, తమన్నా డ్యాన్స్ లతో క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించనున్నారు.

Advertisement

Next Story