ఆసియాలోనే బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ అతడే : వీరేంద్ర సెహ్వాగ్

by Vinod kumar |
ఆసియాలోనే బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ అతడే : వీరేంద్ర సెహ్వాగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో మిడిలార్డర్ బ్యాటర్లు పలు రికార్డులు బద్దలు కొట్టారు. అందులో టీమ్ ఇండియా లెజెండ్స్ రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వంటి వారు కూడా మిడిలార్డర్‌లో ఆడిన వారే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ చక్కిదిద్దే బాధ్యత వీళ్లపై ఉంటుంది. క్రికెట్‌లో బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ ఎవరు అనే ప్రశ్నకు టీమ్ ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన తరంలో బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ ఎవరో చెప్పిన సెహ్వాగ్.. సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి వారికి షాకిచ్చాడు. ఇంటర్వ్యూలో ఆసియాలోనే బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ ఎవరు? అని సెహ్వాగ్‌ను అడిగారు.

దీనికి సమాధానం ఇచ్చిన సెహ్వాగ్.. పాకిస్తాన్ మాజీ సారధి ఇంజమామ్ ఉల్ హక్ పేరు చెప్పాడు. అందరూ సచిన్ గురించే మాట్లాడతారని, కానీ ఇంజీ భాయ్ కూడా అద్భుతమైన బ్యాటర్ అని చెప్పాడు. కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇంజమామ్ ప్రశాంతంగా ఉండేవాడని, ఎంత ఒత్తిడి ఉన్నా ఆడేందుకు ఇబ్బంది పడేవాడని చెప్పాడు. 'ఇంజీ భాయ్ చాలా మంచివాడు. అందరూ సచిన్ గురించే మాట్లాడతారు. కానీ నా దృష్టిలో ఆసియాలో బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్ ఇంజామామే' అన్నాడు.

పాకిస్తాన్ క్రికెట్‌లో ఇంజమామ్ ఉల్ హక్ 1991లో ఆ దేశం తరఫున అరంగేట్రం చేయగా.. ఆ మరుసటి సంవత్సరం వన్డే వరల్డ్ కప్ నెగ్గిన పాక్ జట్టులో కీలకపాత్ర పోషించాడు. 378 వన్డేలు, 120 టెస్టులు ఆడిన అతను.. వన్డేల్లో 11,739 పరుగులు, టెస్టుల్లో 8,830 పరుగులు చేశాడు.

Advertisement

Next Story