- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నైనా జైశ్వాల్ మరో ఘనత.. 22 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పూర్తి
హైదరాబాద్: భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ మరో ఘనత సాధించింది. క్రీడల్లోనే కాకుండా చదువులోనూ ఈ హైదరాబాద్ అమ్మాయి నెలకొల్పిన రికార్డులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెన్త్ క్లాస్, ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె 22 ఏళ్ల వయసులోనే పీహెచ్‌డీ పూర్తి చేసింది. దాంతో భారత్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన అతిపిన్న వయస్కురాలిగా నైనా జైశ్వాల్ ఘనత సాధించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఆదికవి నన్నయ యూనివార్సిటీలో ఆమె పీహెచ్‌డీ కంప్లీట్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మహిళా సాధికారితలో మైక్రో ఫైన్సాన్స్ పాత్రపై తాను అధ్యయనం చేసి ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు నైనా జైశ్వాల్ తెలిపింది. సివిస్ సర్వీసెస్‌లోకి వెళ్లడం తన లక్ష్యమని పేర్కొంది. అలాగే, ప్రస్తుతం స్పోర్ట్స్ కెరీర్‌పై ఫోకస్ పెట్టానని, అంతర్జాతీయ టోర్నీలతోపాటు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనాలనుకుంటున్నట్టు చెప్పింది.
- Tags
- Naina Jaiswal
- PhD