‘మటన్ తినకపోతే మనోడి బౌలింగ్ స్పీడ్ తగ్గుతుంది’.. స్టార్ బౌలర్ ఫ్రెండ్ షాకింగ్ స్టేట్‌మెంట్

by Gantepaka Srikanth |   ( Updated:2024-07-26 14:59:35.0  )
‘మటన్ తినకపోతే మనోడి బౌలింగ్ స్పీడ్ తగ్గుతుంది’.. స్టార్  బౌలర్ ఫ్రెండ్ షాకింగ్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు ఎన్నో విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా షమీ వ్యక్తిగత జీవితంపై అతని మిత్రుడు ఉమేశ్ కీలక విషయాలు వెల్లడించారు. షమీ దేనిని అయినా భరిస్తాడు కానీ, మటన్ లేకపోతే తట్టుకోలేడు అని అన్నారు. వారంలో ఒక్క రోజు మాత్రమే మటన్ లేకుండా ఉండగలుగుతాడు. కానీ, రెండో రోజు కూడా లేకపోతే అరిచి గోల చేస్తాడని చెప్పారు. ఇక వరుసగా మూడోరోజు కూడా లేకపోతే సహనం కోల్పోయి ఏం చేస్తాడో తెలియదు అని అన్నారు. తిన్న ప్రతిసారి కేజీ మటన్ లాగించేస్తాడని.. ఒకవేళ అతను మటన్ తినకపోతే బౌలింగ్ వేగం గంటకు 15km తగ్గుతుందని చెప్పుకొచ్చారు. కాగా, షమీ 2023లో అర్జున అవార్డు అందుకున్నారు.

Read More..

Zafrani Chai : హైద్రాబాద్లో ఆ కొత్త రకం టీ కోసం ఎగబడుతున్న జనాలు.. రేటెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే





Advertisement

Next Story