- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విరాట్ కోహ్లీకి మరో షాక్.. చర్యలకు సిద్ధమైనా బీసీసీఐ..?
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం బ్యాడ్టైం నడుస్తోంది. మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 3 ఫార్మట్ల కెప్టెన్సీకి గుడ్ బాయ్ చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాకుండా రన్ మెషిన్ సెంచరీ చేయకుండా రెండు సంవత్సరాలు దాటింది. ప్రస్తుతం బీసీసీఐకి, కోహ్లీకి విభేదాలు వచ్చినట్లు సమాచారం. కోహ్లీని ఉన్న ఫలంగా వన్డే కెప్టెన్సీ నుండి తొలగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి. దీనితో కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుండి కూడా తప్పుకున్నాడు. అయితే తాజాగా.. కోహ్లీకి మరో సమస్య ఎదురుకానుంది. దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు విరాట్ ప్రెస్ మీట్ పెట్టడంతో బీసీసీఐ ఆగ్రహంగా ఉంది. దీనితో బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కోహ్లీకి షాకాజ్ నోటిస్ పంపాలని భావించాడట. కానీ బోర్డ్‌లో మరో సభ్యుడు అడ్డుపడటంతో దాదా వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. కోహ్లీ టెస్ట్ కెప్టె్న్సీ నుంచి తప్పుకునే ముందు కూడా బీసీసీఐతో మాట్లాడాకుండా కేవలం ఆటగాళ్లతో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. నిజంగానే కోహ్లీకి నోటిస్‌లు ఇచ్చి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవి.