Indonesia open 2023: చరిత్ర సృష్టించిన సాత్విక్‌–చిరాగ్‌.. తొలి భారత జోడీగా రికార్డ్

by Vinod kumar |   ( Updated:2023-06-20 14:03:45.0  )
Indonesia open 2023: చరిత్ర సృష్టించిన సాత్విక్‌–చిరాగ్‌.. తొలి భారత జోడీగా రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌లో విజేతగా నిలిచి సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ చరిత్ర సృష్టించింది. తుది పోరులో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడి మలేషియాకు చెందిన అరోన్​చియా-సో వూయ్​ఇక్ జోడీని 21-17, 21-18 తేడాతో ఓడించింది. బీడబ్ల్యూఎఫ్​వరల్డ్ టూర్ సూపర్ 1000 టైటిల్‌లో గెలిచిన తొలి భారత్​జోడీగా రికార్డుకెక్కింది.

Advertisement

Next Story

Most Viewed