సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్‌ విడుదల

by Vinod kumar |
సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్‌ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్‌, జనవరిలో భారత క్రికెట్‌ జట్టు.. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ అధికారికంగా విడుదల చేసింది. మూడు ఫార్మాట్ల సిరీస్‌లు జరిగే ఈ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, ఆ తర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఆఖర్లో 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరుగనుంది. సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన 2024 జనవరి 7తో ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగే 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ఫ్రీడం సిరీస్‌గా నామకరణం చేయబడింది.

సౌతాఫ్రికాలో భారత పర్యటన షెడ్యూల్‌ వివరాలు..

టీ20 సిరీస్‌..

డిసెంబర్‌ 10: తొలి టీ20 (డర్బన్‌)

డిసెంబర్‌ 12: రెండో టీ20 (గ్వేబెర్హా)

డిసెంబర్‌ 14: మూడో టీ20 (జోహనెస్‌బర్గ్‌)

వన్డే సిరీస్‌..

డిసెంబర్‌ 17: తొలి వన్డే (జోహనెస్‌బర్గ్‌)

డిసెంబర్‌ 19: రెండో వన్డే (గ్వేబెర్హా)

డిసెంబర్‌ 21: మూడో వన్డే (పార్ల్‌)

ఫ్రీడం సిరీస్‌..

డిసెంబర్‌ 26 నుంచి 30: తొలి టెస్ట్‌ (సెంచూరియన్‌)

2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్‌ (కేప్‌టౌన్‌)

Advertisement

Next Story

Most Viewed