భారత్ ఘోర పరాజయం.. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-07 15:10:28.0  )
భారత్ ఘోర పరాజయం.. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న శ్రీలంక
X

దిశ, వెబ్‌డెస్క్: కొలంబోని ప్రేమదాస మైదానం వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. శ్రీలంక నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలుపొందిన శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకున్నది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(35), విరాట్ కోహ్లీ(20), వాషింగ్టన్ సుందర్ (30) పర్వాలేదు అనిపించగా.. గిల్(06), పంత్(06), అయ్యర్(08), అక్షర్(02), పరాగ్(15), దూబే(09) సహా అంతా విఫలం అయ్యారు. శ్రీలంక బ్యాటర్లలో నిసాంక(45), ఫెర్నాండో(96), మెండిస్(59) అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement

Next Story