- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హాకీకి దీప్ గ్రేస్ రిటైర్మెంట్
దిశ, స్పోర్ట్స్ : భారత హాకీ క్రీడాకారిణి, సీనియర్ డిఫెండర్ దీప్ గ్రేస్ ఎక్కా అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించింది. 12 సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు శనివారం ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. 2011 నుంచి 2013 వరకు ప్రయాణం నా జీవితంలో హైలెట్. నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు చాలా గౌరవంగా ఉంది. ’ అని దీప్ గ్రేస్ తెలిపింది. దీప్ గ్రేస్ రిటైర్మెంట్‌పై హాకీ ఇండియా స్పందించింది. దీప్ గ్రేస్ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు తెలిపింది.
ఒడిశాకు చెందిన దీప్ గ్రేస్ 2011లో అంతర్జాతీయ హాకీలో అడుగుపెట్టింది. అర్జెంటీనాలో జరిగిన ఫోర్ నేషన్ టోర్నమెంట్‌తో ఆమె హాకీ కెరీర్ మొదలైంది. భారత్ తరపున 268 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించింది. 24 గోల్స్ చేసింది. కాగా, 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భారత మహిళల హాకీ జట్టుకు దీప్ గ్రేస్ ఎంతో సేవ చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌కు భారత్ అర్హత సాధించడంతో దీప్ గ్రేస్ కీలక పాత్ర పోషించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 4వ స్థానంలో నిలవడంలోనూ ఆమె ఆమె కీలకంగా వ్యవహరించింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టుతోపాటు 2014, 2018 ఆసియా గేమ్స్‌లో పతకాలు గెలిచిన జట్లలోనూ ఆమె సభ్యురాలు.