- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గార్డెన్ ఓపెన్ టైటిల్ సుమిత్‌దే.. యూరోప్ గడ్డపై తొలి భారత ఆటగాడిగా రికార్డ్..
రోమ్: ఇటలీలో జరిగిన గార్డెన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సుమిత్ 6-3, 6-2 తేడాతో నెదర్లాండ్స్‌కు చెందిన జెస్పర్ డె జాంగ్‌ను చిత్తు చేశాడు. తుది పోరులో పూర్తి ఆధిపత్యం చాటిన భారత ఆటగాడు గంట 42 నిమిషాల్లో వరుస సెట్లను గెలుచుకుని ప్రత్యర్థి ఆట కట్టించాడు.
తొలి సెట్‌లో మూడు సార్లు జాంగ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి శుభారంభం చేసిన సుమిత్.. రెండో సెట్‌లోనూఇటలీలో జరిగిన గార్డెన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు.మూడు బ్రేక్ పాయింట్లతో సెట్‌తోపాటు ఆటను కైవసం చేసుకుని టైటిల్ సొంతం చేసుకున్నాడు. సుమిత్ కెరీర్‌లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ టూర్ టైటిల్ కాగా.. గత నాలుగేళ్లలో ఇదే మొదటిది. యూరోప్ గడ్డపై ఏటీపీ చాలెంజర్ ట్రోఫీ గెలుచుకున్న తొలి భారత ఆటగాడిగా సుమిత్ రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో సుమిత్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 122 ర్యాంక్‌ను సాధించాడు.