- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా.. వధువు ఆమె..!
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ స్టార్ క్రికెటర్ హర్దిక్ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ వాలెంటైన్స్ (ఫిబ్రవరి 14)న హార్దిక్ పాండ్యా మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మూడేళ్ల కిందటే పెళ్లి చేసుకున్న హార్దిక్ కు మళ్లీ పెళ్లి ఏంటీ అనే కదా మీ డౌట్. అయితే తాను పెళ్లి చేసుకోబోయేది తన భార్య నటాషానే. తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటనీ మళ్లీ మీకు డౌట్ రావచ్చు. అసలు విషయం ఏంటంటే.. హార్దిక్ పాండ్యా, నటాషా చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట 2020, మే 31న కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత వాళ్లకు అగస్త్య అనే బాబు కూడా పుట్టాడు. అయితే తన ఆటతీరుతో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న హార్దిక్ కు.. పెళ్లి మాత్రం అందరికి తెలిసేలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోలేదనే బాధ ఉండేదట.
ఈ క్రమంలోనే ఆయన తన భార్య నటాషాను ఈ ప్రేమికుల రోజున పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ స్టార్ కపుల్ మ్యారేజ్ జరగనుంది. ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు హార్దిక్-నటాషాల వెడ్డింగ్ గ్రాండ్ గా జరగునుంది. వెడ్డింగ్ లో భాగంగా హల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఉండనున్నాయి. ఇక వీళ్ల మ్యారేజ్ కు అటు క్రీడా ప్రముఖులే కాకుండా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా హాజరవుతున్నట్లు సమాచారం. మొత్తానికి తన విధ్వంసకరమైన ఆటతీరుతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే హార్దిక్ పాండ్యా.. ఈ సారి మాత్రం రీ మ్యారేజ్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.