అంజలి దేవిపై నాలుగేళ్లు నిషేధం

by Harish |   ( Updated:2024-02-21 17:47:17.0  )
అంజలి దేవిపై నాలుగేళ్లు నిషేధం
X

దిశ, స్పోర్ట్స్ : డోప్ టెస్టులో పట్టుబడ్డ హర్యానా స్ప్రింటర్ అంజలి దేవిపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) వేటు వేసింది. గతేడాది జూన్‌లో నిర్వహించిన డోప్ టెస్టులో అంజలి దేవి విఫలమవ్వగా తాత్కాలిక సస్పెన్షన్‌కు గురైంది. తాజాగా ఆమెపై నాడా నాలుగేళ్ల నిషేధం విధించింది. గతేడాది జూలై 7 నుంచి ఆమెపై నిషేధం కొనసాగుతుందని నాడా తెలిపింది. డోప్ టెస్టులో అంజలి దేవి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) నిషేధిత డ్రగ్ జీడబ్ల్యూ1516 పాజిటివ్‌గా తేలింది. జీడబ్ల్యూ1516 అనే పదార్థం సామర్థ్యాన్ని పెంచడంతోపాటు కొవ్వు‌ను తగ్గిస్తుంది. అమెరికా యాంటీ డోపింగ్ ఏజెన్సీ వెబ్‌‌సైట్ ప్రకారం.. ఈ డ్రగ్ క్యాన్సర్‌కు కారణమని గుర్తించారు. కాగా, గతేడాది ఇంటర్ స్టేట్ నేషనల్స్‌లో అంజలి దేవి 400 మీటర్ల రేసును 51.48 సెకన్లలో ముగించి స్వర్ణ పతకం గెలుచుకుంది.


Advertisement

Next Story