భారత క్రికెటర్లపై బంగ్లా పేసర్ ప్రశంసలు.. వరల్డ్‌లోనే బెస్ట్ ప్లేయర్లంటూ కితాబు

by Harish |
భారత క్రికెటర్లపై బంగ్లా పేసర్ ప్రశంసలు.. వరల్డ్‌లోనే బెస్ట్ ప్లేయర్లంటూ కితాబు
X

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెటర్లపై బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్ ప్రశంసలు కురిపించాడు. వరల్డ్ క్రికెట్‌లోనే భారత ప్లేయర్లు బెస్ట్ అని ప్రశంసించాడు. బంగ్లాదేశ్‌ను వరుసగా రెండు టీ20ల్లో ఓడించిన భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టీ20 సిరీస్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. రెండో మ్యాచ్ అనంతరం తస్కిన్ మీడియాతో మాట్లాడుతూ..‘భారత ప్లేయర్లు ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆటగాళ్లు. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. సొంత మైదానాల్లోనే కాదు ప్రపంచంలోని ఏ పరిస్థితుల్లోనైనా వారు అద్భుత ప్రదర్శన చేస్తారు.’ అని తెలిపాడు. రెండో టీ20లో బంగ్లా ఓటమిపై స్పందిస్తూ.. ‘భారత ఆటగాళ్లు మా కంటే చాలా అనుభవజ్ఞులు, మెరుగైన ప్లేయర్లు. బ్యాటింగ్‌లో మా పూర్తి సామర్థ్యంతో ఆడలేకపోయింది. మా స్పిన్నర్లకు కూడా చెడ్డ రోజు. మంచు కారణంగా వాళ్లు ఇబ్బంది పడ్డారు. మాకు దాదాపుగా చెడ్డ రోజులు ఉండవు. కానీ, టీ20ల్లోనే ఏదైనా జరగొచ్చు.’ అని తస్కిన్ చెప్పుకొచ్చాడు. శనివారం హైదరాబాద్ వేదికగా ఆఖరిదైన మూడో టీ20 జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed