- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాత్విక్ జోడీ అదరహో.. క్వార్టర్స్‌లో 3వ సీడ్‌కు షాక్
దుబాయ్: ఏషియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల స్టార్ జంట సాత్విక్-చిరాగ్ శెట్టి అదరగొట్టింది. తొలిసారి సెమీస్‌కు దూసుకెళ్లిన ఈ జోడీ 52 ఏళ్ల తర్వాత మెన్స్ డబుల్స్‌లో భారత్‌కు పతకం ఖాయం చేసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 21-11, 21-12 తేడాతో 3వ సీడ్, ఇండోనేషియాకు చెందిన మహ్మద్ అహ్సాన్-హెండ్రా సెటియవాన్ జోడీని చిత్తు చేసింది. పూర్తి ఆధిపత్యంతో వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకున్న భారత ద్వయం 28 నిమిషాల్లో ప్రత్యర్థి జంట ఆట కట్టించింది.
మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు జోరుకు బ్రేక్ పడింది. క్వార్టర్స్‌లో 2వ సీడ్, కొరియాకు చెందిన యాన్ సె యంగ్‌తో తలపడిన సింధు 21-18, 5-21, 9-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నిలువరించి శుభారంభం చేసిన సింధు.. మిగతా రెండు గేముల్లో తేలిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. గత ఎడిషన్‌లో సింధు బ్రాంజ్ మెడల్ గెలుచుకోగా.. ఈ సారి క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ సైతం టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.
క్వార్టర్స్‌లో జపాన్ ఆటగాడు సునేయామాతో తలపడిన అతను.. తొలి గేమ్ ఓటమి అనంతరం గాయం కారణంగా ఆట నుంచి తప్పుకున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-సిక్కిరెడ్డి జోడీ 18-21, 21-19, 15-21 తేడాతో ఇండోనేషియా ద్వయం డెజాన్ ఫెర్డినాన్స్యా-గ్లోరియా ఇమాన్యూల్ విడ్జాజా చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.