కుర్రాళ్లు టైటిల్ నిలబెట్టుకుంటారా?.. నేటి నుంచి థామస్ కప్

by Dishanational3 |
కుర్రాళ్లు టైటిల్ నిలబెట్టుకుంటారా?.. నేటి నుంచి థామస్ కప్
X

దిశ, స్పోర్ట్స్ : భారత షట్లర్లు ప్రతిష్టాత్మక పోరుకు సిద్ధమయ్యారు. నేటి నుంచే థామస్ కప్(పురుషుల), ఉబెర్ కప్(మహిళల) బ్యాడ్మింటన్ టోర్నీలు ప్రారంభంకానున్నాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలకు ఈ సారి చైనాలోని చెంగ్డు ఆతిథ్యమిస్తున్నది. 2022లో జరిగిన గత ఎడిషన్‌లో భారత కుర్రాళ్లు సంచలనం సృష్టించారు. తొలిసారిగా థామస్ కప్ టైటిల్‌ను దక్కించుకున్నారు. మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవడంపై కన్నేశారు.

పురుషుల డబుల్స్ జంట సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్, సింగిల్స్‌ ప్లేయర్లలో హెచ్.ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రియాన్ష్ రజావత్, కిరణ్ జార్జ్‌ ఇటీవల మంచి ప్రదర్శన చేశారు. గ్రూపు-సిలో ఉన్న భారత జట్టు నేడు తొలి మ్యాచ్‌లో థాయిలాండ్‌తో తలపడనుంది.

మరోవైపు, ఉబెర్‌ కప్‌లో పూర్తిగా యువ క్రీడాకారిణులతో మహిళల జట్టు బరిలోకి దిగనుంది. స్టార్ షట్లర్ పీవీ సింధు దూరంగా ఉండటం జట్టుకు భారీ లోటే. ఆసియా టీమ్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన యువ క్రీడాకారిణి అన్మోల్ ఖర్బ్‌పై అందరి దృష్టి ఉంది. అలాగే, తన్వీ శర్మ, అష్మిత వారిపై ఆశలు ఉన్నాయి. గ్రూపు-ఏలో నేడు తొలి మ్యాచ్‌లో కెనడాను భారత జట్టు ఎదుర్కోనుంది. స్టార్లు లేకుండా యువ క్రీడాకారిణులతో కూడిన మహిళల జట్టు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.



Next Story