కీలకమైన సిరీస్‌ల ముందు అక్కడ మ్యాచ్‌లు ఆడాలి.. గంభీర్ ఆసక్తికర కామెంట్స్

by Vinod kumar |
కీలకమైన సిరీస్‌ల ముందు అక్కడ మ్యాచ్‌లు ఆడాలి.. గంభీర్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా ఆటగాళ్లపై భారత మాజీ ఓపెనర్ గౌత‌మ్ గంభీర్ కీలక కామెంట్స్ చేశాడు. కీల‌క‌మైన సిరీస్‌ల ముందు టీమ్ ఇండియా క్రికెట‌ర్లు రంజీ మ్యాచ్‌లు ఆడితే బాగుంటుంద‌ని మాజీ ఓపెన‌ర్ గౌత‌మ్ గంభీర్ స‌ల‌హా ఇచ్చాడు. స‌రైన స‌న్నద్ధత లేకుండానే టీమ్ ఇండియా క్రికెట‌ర్లు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్నారని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అందువ‌ల్లే ప్లేయర్స్ తమ సామ‌ర్థ్యాల‌కు త‌గిన‌ట్లుగా ఆడ‌లేక‌పోతున్నార‌ని విమ‌ర్శించాడు. బోర్డర్ గ‌వాస్కర్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడు టెస్టుల్లో రెండింటిలో టీమ్ ఇండియా విజ‌యాన్ని సాధించింది.

ఈ మ్యాచ్‌ల‌లో బౌలింగ్ బ‌లంతోనే గ‌ట్టెక్కింది. బ్యాటింగ్ ప‌రంగా రోహిత్ శ‌ర్మ, విరాట్ కోహ్లితో పాటు కీల‌క‌మైన ప్లేయ‌ర్లు అంద‌రూ అంచ‌నాల‌కు త‌గ్గట్లుగా రాణించ‌లేక‌పోవ‌డం టీమ్ ఇండియాను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ నేప‌థ్యంలో గంభీర్ టీమ్ ఇండియా క్రికెట‌ర్ల బ్యాటింగ్ తీరుపై కీలక కామెంట్స్ చేశాడు. బోర్డర్ గ‌వాస్కర్ లాంటి కీల‌క‌మైన టెస్ట్ సిరీస్‌ల ముందు ప్లేయర్స్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడితే బాగుంటుంద‌ని పేర్కొన్నాడు. స‌రైన ప్రాక్టీస్ లేద‌నే ప్రతికూల ఆలోచ‌న‌ల వ‌ల్లే రెండు టెస్ట్‌ల‌లో ఆస్ట్రేలియా ఓట‌మి పాలైంది. కీల‌క‌మైన టెస్ట్ సిరీస్‌ల‌ ముందు రంజీ ఆడ‌టం వ‌ల్ల ప్లేయ‌ర్లలో పాజిటివ్ నెస్ పెరుగుతుంది. వారికి ప్రాక్టీస్ దొరుకుతుంద‌ని గంభీర్ పేర్కొన్నాడు.

Advertisement

Next Story