ఆ ఇద్దరు రాణించకపోతే.. ఆస్ట్రేలియాకు వైట్ వాష్ తప్పదు: గవాస్కర్

by Satheesh |   ( Updated:2023-02-13 06:02:38.0  )
ఆ ఇద్దరు రాణించకపోతే.. ఆస్ట్రేలియాకు వైట్ వాష్ తప్పదు: గవాస్కర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోన్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 4 టెస్ట్‌ల సిరీస్‌‌లో భాగంగా నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌తో తేడాతో ఓడిన ఆసీస్‌ రెండవ టెస్ట్‌లో కమ్ బ్యాక్ ఇవ్వాలంటే వాళ్ల టాపార్డర్ గొప్పగా రాణించాలన్నారు. ఆస్ట్రేలియా టాపార్డర్ రాణించకపోతే వాళ్లు ఈ సిరీస్ గెలవడం దాదాపు కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ఆసీస్ స్టార్ ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ ఈ సిరీస్‌లో రాణించాలని.. ఆ ఇద్దరు కనుక ఎక్కువ పరుగులు చేయకపోతే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 4-0తో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేస్తుందని జోస్యం చెప్పారు. స్మిత్, లబుషేన్ ప్రదర్శనపై ఆసీస్ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయని గవాస్కర్ పేర్కొన్నారు.

ఇక, బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో భాగంగా నాగ్ పూర్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మార్నస్ 66 పరుగులు, స్మిత్ 62 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగితా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో భారత్ అద్భుత విజయం సాధించి.. సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఇక, ఈ నెల 17వ తేదీన ఢిల్లిలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రెండవ టెస్ట్ జరగనుంది.

Advertisement

Next Story