IND vs PAK: మళ్లీ వర్షం.. రిజర్వ్‌ డేకు మ్యాచ్‌

by Vinod kumar |   ( Updated:2023-09-11 16:37:01.0  )
IND vs PAK: మళ్లీ వర్షం.. రిజర్వ్‌ డేకు మ్యాచ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌ సూపర్‌-4లో భాగంగా భారత్, పాక్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్‌ డేకు వాయిదా వేశారు. మ్యాచ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన వేళ.. వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్‌ డేకు వాయిదా వేశారు. ఈ రోజు భారత్ ఇన్నింగ్స్‌లో 24.1 ఓవర్ల వద్ద నిలిచిపోయింది. రేపు తిరిగి అక్కడి నుంచి మ్యాచ్‌ కొనసాగనుంది. నేడు మ్యాచ్‌ ఆగిపోయే సరికి భారత్ స్కోరు 147/2. కేఎల్ రాహుల్ (17), విరాట్ కోహ్లీ (8) పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే పాక్‌ అంచనాలను తలకిందులు చేస్తూ భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (56), శుభ్‌మన్‌ గిల్‌ (58) ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. అర్ధశతకాలు పూర్తి చేసుకున్న తర్వాత వీరిరువురు ఔటయ్యారు. 24.1 ఓవర్ల తర్వాత వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ ఆగిపోయింది. ఈ సమయానికి టీమిండియా స్కోర్‌ 147/2గా ఉంది. విరాట్‌ కోహ్లి (8), కేఎల్‌ రాహుల్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌, షాహీన్‌ అఫ్రిది తలో వికెట్‌ పడగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed