India vs Ireland: ఐర్లాండ్‌తో మూడో టీ20.. మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు

by Vinod kumar |
India vs Ireland: ఐర్లాండ్‌తో మూడో టీ20.. మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ని 3-0 క్లీన్‌స్వీప్‌ చేయాలనుకున్న టీమ్‌ ఇండియా ఆశలకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. మ్యాచ్‌ జరగాల్సి ఉన్న ‘ది విలేజ్’ స్టేడియం పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండున్నర గంటల నుంచి భారీగా వర్షం కురుస్తోంది. దీంతో ఇప్పటివరకు టాస్‌ కూడా పడలేదు. 9: 15 గంటల తర్వాత నుంచి ఓవర్ల కుదింపు ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. వర్షం ఆగితే తప్పా మ్యాచ్ జరిగే అవకాశాలు లేవు. కనీసం ఐదు ఓవర్ల ఆట సాధ్యమైతేనే మ్యాచ్ నిర్వహిస్తారు. లేకుంటే రద్దు చేస్తారు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే మొదటి రెండు టీ20ల్లో విజయం సాధించిన భారత్‌ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంటుంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌ను క్లీన్‌స్వీప్‌ చేయకుండా అడ్డుకోవడం ఐర్లాండ్‌కు కష్టమైన పనే.

Advertisement

Next Story

Most Viewed